![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లలో గుప్పెడంత మనసుకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దీనికి కారణం లేకపోలేదు రిషి అలియాస్ ముఖేశ్ గౌడ, వసుధార అలియాస్ రక్ష గౌడ ల ఆన్ స్క్రీన్ ప్రేమకథకి ప్రేక్షకులు ఫిధా అయ్యారు.
ఇప్పటికే ఈ సీరియల్ వెయ్యి ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. మొదట్లో వసుధార డీబీఎస్టీ కాలేజీలో జాయిన్ అయ్యింది. ఆ తర్వాత రిషి, వసుధారల ప్రేమ చిగురించింది. వాళ్ళ ప్రేమకు తోడుగా నిలిచింది రిషి వాళ్ళ అమ్మ జగతి. అయితే రిషి, జగతిల మధ్య మాటలు మేడమ్, సర్ అనేంతలా ఉండటంతో ఎప్పుడెప్పుడు తనని అమ్మ అని రిషి పిలుస్తాడా అని వెయిట్ చేసారంతా.. ఆ తర్వాత శైలేంద్ర ఎండీ చేర్ కోసం చేసిన కుట్రలో జగతి మరణించింది. జగతి చివరి రోజుల్లో తనని రిషి అమ్మ అని పిలిచాడు. ఆ ఎపిసోడ్స్ అన్నీ అందరికి తెగ నచ్చాయి. జగతి చనిపోయాక రిషి ఒంటరి వాడయ్యాడు. వసుధార తోడుగా ఉన్న అమ్మ జ్ఞాపకాలలో నుండి తొందరగా బయటకు రాలేకపోయాడు. ఆ తర్వాత కొన్ని ఎపిసోడ్ ల తర్వాత ఎండీ సీటు కోసం రిషి మీద రౌడీలతో ఎటాక్ చేయించి గాయాలపాలయ్యేలా చేశాడు శైలేంద్ర. దాంతో కొన్ని ఎపిసోడ్ ల నుండి అజ్ఞాతంలోనే ఉన్నాడు రిషి. ఇద్దరు ముసలివాళ్ళ సాయంతో కోలుకున్నట్టు చూపించగా.. కాలేజీ ఫెస్ట్ కి రిషి వస్తుండగా మళ్ళీ రౌడీలు ఎటాక్ చేపించారని ముగించారు. అప్పటి నుండి రిషి కనపడటం లేదు.
రిషి స్థానంలోకి ఎవరైనా వస్తారా లేక సపోర్ట్ గా ఎవరైన వస్తారా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి మను రూపంలో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ జరిగింది. అయితే మను ఎవరో కాదు అనుపమ వాళ్ళ కొడుకని ఇండైరెక్ట్ గా డైరెక్టర్ తెలియజేసాడు. ఆపదలో ఉన్న కాలేజీని యాభై కోట్లు ఇచ్చి కాపాడతాడు మను. దాంతో అందరికి అతనిపై మంచి అభిప్రాయం కలుగుతుంది. కానీ వసుధార మాత్రం అతని వెనక ఎవరో ఉన్నారని అనుమానపడుతుంది. అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. వాళ్ళ పెద్దమ్మకి అనుపమకి కాల్ చేసి మను ఉన్నాడా అని అడుగగా.. ఎవరో ఇంటికి భోజనానికి వెళ్ళాడని చెప్తుంది. అయితే కాసేపటికి అనుపమ, వసుధారలతో మహేంద్ర మాట్లాడుతాడు. ఇంట్లో ఎవరికి తెలియకుండా మహేంద్ర సర్ ప్రైజ్ ప్లాన్ చేశానని చెప్తాడు. కాసేపటికి మను ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఎక్స్ క్యూజ్ మీ అని అంటాడు. దాంతో అనుపమ, వసుధారలు మనుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి మను అనుపమ కొడుకే అనే నిజం తెలియనుందా? అమ్మ కొడుకులిద్దరు ఎలా ఉండగలరో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
![]() |
![]() |